సిరా న్యూస్,కర్నూలు;
మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందవరం మండలంలో రూ.42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మిగ నూరు ప్రజలకోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పడ్డ శ్రమ, తపన మాటల్లో చెప్ప లేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకు పోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను నాటి ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించు కున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం ద్రనాథ్ వెల్లడించారు. అనేక కారణాల వల్ల బ్రిడ్జి నిర్మాణానికి పదేళ్ల కాలం పట్టినా ఎట్టకేలకు పట్టువదల కుండా ఎన్ని అవాంతరాలొచ్చినా అధి గమిం చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రజలకు ఎంతో అవస రమైన ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అడగ్గానే అంగీకరించిన విషయాన్ని ఆర్థిక మం త్రి గుర్తు చేశారు. త్వరలోనే తుంగభద్ర నదికి అవతల ఉన్న రహదారిని మరింత సామర్థ్యవంతంగా తీర్చిదిద్దేం దుకు కృషి చేయనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.