సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో గ్రామ ఇలవేల్పు శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుండి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు,పంచాయతీ సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు , ఆలయ ధర్మకర్త పైల పోతునాయుడు(పెద్దింటి) ,ఉప సర్పంచ్ బండారు రామారావు ,సాధన సంస్థ అధినేత పైల గోపాలకృష్ణ ,టీడీపీ నాయకులు పైల సన్యాసిరావు మాస్టర్ , పైల రామచంద్ర రావు , అనువంశిక పూజారి పైల నరసింగరావు(పెద్దింటి) , పెద్ద చెరువు అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు , వార్డ్ మెంబర్ పైల హరీష్ ,గండి ఈశ్వరరావు, నాయకులు పైల సూర్యనారాయణమూర్తి , వర్రి హరి ,పైల పైడంనాయుడు(గరగ ), పైలా అప్పారావు, పైల ప్రసాద్ , పైల కృష్ణ, బండారు రాజు , చుక్క గోపి , రాజన సత్యం, యూత్ సభ్యులు , ప్రజలు , భక్తులు , అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
===========