తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవం

ఖండించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి
 సిరా న్యూస్,హైదరాబాద్‌;
తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. మెదక్‌ జిల్లా సమస్యలు వివరించేందుకే నిన్న సీఎం రేవంత్‌రెడ్డి ని కలిశామన్నారు. పార్టీ మారుతున్నారని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి వరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు.కాగా, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌డీఎఫ్‌) ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌డీఎఫ్‌తోపాటు ప్రొటోకాల్‌ ఉల్లంఘన, గన్‌మెన్ల కుదింపు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసికెళ్లినట్టు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఎస్‌డీఎఫ్‌ అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని పేర్కొన్నారు.ప్రొటోకాల్‌ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సీఎంను కలిసిన వారిలో తనతోపాటు పటాన్‌చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఉన్నారని చెప్పా రు. అంతకుముందు గన్‌మెన్ల కుదింపు అంశాన్ని ఇంటెలిజెన్స్‌ ఐజీ శివధర్‌రెడ్డిని కలిసి వివరించినట్టు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *