సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. నేను గత పదేళ్లుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కష్ట పడ్డాను. భవిష్యత్ లో రేవంత్ కి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తా. సభలో బీఆర్ఎస్ నేతలను అరుస్కుంటుండు కాబట్టే ఓటు కు నోటు కేసు తెరపైకి తెచ్చారని అన్నారు.
నిన్న రేవంత్ కి ఇచ్చిన నోటీసులో పస లేదు. ఇచ్చిన వారికంటే తిసుకున్నవాడే దొంగ. తెలంగాణలో నిన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఇక్కడి న్యాయ న్యాయస్థానాలపై నమ్మకం లేదు. అందుకే ఇతర రాష్ట్రాల కు వెళ్లారని అన్నారు. దేశంలోని న్యాయస్థానాలకు మాత్రమే కాదు అమెరికా వెళ్లిన మాకు ఏ ఇబ్బంది లేదని అయనఅన్నారు.