సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండలం కలపాక పంచాయతీ మూల స్వయంవరం గ్రామాన్ని తరలించాలని మంగళవారం ఆ గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేశారు.ఎన్టిపిసి కాలుష్యంతో గ్రామంలో తీవ్రమైన అనారోగ్యాల
పాలవుతున్నారని గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. దుమ్మి,ధూళి నీటి తుంపర్ల నుండిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కాలుష్యకారలో చిక్కుకొనిగ్రామంలో మంచినీరు కొనుక్కొని తాగవలసిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కాలుష్యం వలన ఉత్పత్తి రావడంలేదని, పశువులు కూడా అనారోగ్యాలు గురవుతున్నాయని అన్నారు,ఎన్టిపిసి కాలుష్యం వలన ఇంటి పైకప్పులు ఇనుము తుప్పు పట్టి భవనాల దెబ్బతింటున్నాయని అన్నారు. శ్వాస, కిడ్నీ, కంటిసమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ, కొత్తపల్లి.బాబురావు, భాను, ప్రసాద్, రమణ, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు
====================