వైసీపీ బాటలోనే గులాబీ దళం

సిరా న్యూస్,హైదరాబాద్;
ఏపీ మాదిరి రాజకీయాలు తెలంగాణలో మొదలయ్యియా? వైసీపీ లైన్‌లో బీఆర్ఎస్ వెళ్తోందా? గత ప్రభుత్వంపై జరుగుతున్న విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కారు పార్టీ ప్రయత్నం చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీకి తిరుగులేదని కొందరి రాజకీయ నేతలు అప్పుడప్పుడు చెబుతారు. ఆ పార్టీని అందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వర్ణిస్తారు కొందరు. అదే పంధాను బీఆర్ఎస్ అనుసరించినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలను గమనిస్తే ముమ్మాటికీ అదేనని అనిపిస్తుంది. రేవంత్ సర్కార్ కేబినెట్ సమావేశాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నానాహంగామా చేస్తున్నారు కారు పార్టీ నేతలు.గడిచిన మూడు నెలలుగా ఇదే వ్యవహారం నడిచింది.. నడుస్తోంది. దీన్ని ముందే పసిగట్టిన రేవంత్ సర్కార్, తన పని తాను చేసుకుపోతోంది. హెల్త్ కార్డు విషయంలో సోమవారం సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే కార్డు (వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు) కాన్సెప్ట్‌ని తెచ్చారు. ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు.ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. దానిపై నానాయాంగీ చేశారు కారు పార్టీ నేతలు. దీనిపై పోలీసులు సైలెంట్ కావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఏపీ పోలీసులను చూసి మేల్కోవాలంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పోలీసు అధికారులకు ఏమైందో చూస్తున్నారు కదా? చట్టాన్ని అతిక్రమిస్తే మీకు ఇలాగే జరుగుతుందని ఓపెన్‌గా పోలీసులను హెచ్చిరించారు హరీష్‌రావు. మరొక నేత కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు అవగాహన లేదని అంటున్నారు.ఇంకోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల గురించి ఆందోళనలు. ఎటువైపు చూసినా రేవంత్ సర్కార్ నిర్ణయాలను డైవర్ట్ చేసి ఓ తరహా నెగిటివ్ ప్రచారాన్ని కారు పార్టీ మొదలుపెట్టేసిందని రాజకీయ విశ్లేషకుల చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ అదే జరుగుతోందని అంటున్నారు.ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఏం జరిగిందో అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు విదేశాలకు వెళ్లిపోయారు. ఆనాటి బీఆర్ఎస్ పాలనలోని అధికారులెక్కడంటూ కాంగ్రెస్ వాదులు బీఆర్ఎస్‌పై సెటైర్లు వేస్తున్నారు. కారు పార్టీ చేస్తున్న రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *