సిరా న్యూస్,కోనసీమ;
గోదావరి జిల్లాలో అరటి కి ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అరటి రైతులు ఉన్నారు. ఎండల తీవ్రతకు అరటి గెలలు మాగిపోతున్నాయి. గోదావరి జిల్లాలో లంక భూములతో పాటు కొబ్బరి తోటల్లో అంతర పంటగా అరటి సాగు అధికంగా చేస్తారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద అరటి మార్కెట్ గా రావులపాలెంలోని అరటి మార్కెట్ కు పేరు. రావులపాలెం అరటి మార్కెట్ కు ప్రతిరోజు 25000 అరటి గెలలు వస్తాయి.ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు బెంగళూరు మహారాష్ట్ర ఒరిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్లో సైకిల్ లోడు 300 రూపాయలకు రైతు వద్ద కొనుగోలు చేస్తుండడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం నుండి రైతులు బయటపడాలంటే ప్రభుత్వం ఎరువులను సబ్సిడీపై అందించాలని అరటి రైతులు కోరుతున్నారు.
=================