సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జ సూర్యాపేట మండలం బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ ను తొలగించకుండా అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ విద్యార్దినిలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ రూములో మద్యం బాటిల్ దొరికిందని తెలిపారు. ప్రిన్సిపల్ కళాశాలలో మద్యంసేవిస్తూ తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. కేర్ టేకర్ సౌమిత్రి పై విద్యార్థినిలు ఆరోపణలు చేయడంతో కళాశాలలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ శైలజను వెంటనే విధులనుంచి తొలగించి మరో ప్రిన్సిపల్ నియమించాలంటూ డిమాండ్ చేసారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు కళాశాలకు చేరుకున్నారు.
====