సిరా న్యూస్,కమాన్ పూర్;
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల జీ.ఎం. కార్యాలయాల ఉద్యోగులకు గత నెల 8వ తేదీన పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు మంగళవారం జి.ఎం. కార్యాలయ ప్రాంగణంలో బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆర్.జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు, ఏ.పీ.ఏ. జనరల్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.
తదుపరి ప్లాస్టిక్ బ్యాగుల వాడకం తగ్గించాలన్న ఉద్దేశ్యంతో అవగాహన కల్పించడం కోసం కొంత మంది ఉద్యోగులకు జూట్ బ్యాగులను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలనీ, దీనిపై మన తోటి వారికి అవగాహన కల్పించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి బ్రాంచ్ సెక్రటరీ ఎం.రామచంద్రరెడ్డి, ఐఎన్టియూసి ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్.వెంకటరమణ, పర్యావరణ అధికారి పి.రాజారెడ్డి, ఫైనాన్స్ ఏజీఎం పి.శ్రీనివాసులు, ఏరియా ఇంజనీర్ వై.వి.శేఖర బాబు, పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి తోపాటు వివిధ విభాగధిపతులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.