సిరా న్యూస్, కుందుర్పి
-దాహం తీర్చిన… ఎంపీ తలారి రంగయ్య
-ఎర్రబోరేపల్లి గ్రామంలో తప్పిన కన్నీటి కష్టాలు
-డాక్టర్ తలారి రంగయ్యను అభినందించిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు
ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. చాలా రోజుల నుంచి గుక్కెడు తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కపూట భోజనం లేకున్నా మానవుడు జీవించొచ్చు కానీ.. నీరు లేకుండా ఉండటం చాలా కష్టం .. అలాంటిది చాలా రోజుల నుంచి నీటి కోసం అల్లాడారు. ఎర్రబోరేపల్లి గ్రామస్తులు.చేతుల్లో బిందెలు పట్టుకుని ఇండ్లలోని చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి నీటి కోసం పరిగె త్తి దాహాన్ని తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా శెట్టూరు మండలం ఎర్రబోరేపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని డాక్టర్ తలారి రంగయ్య తెలుసుకున్నారు. నీటి సమస్యపై కూడా గ్రామస్తులు తలారి రంగయ్య దృష్టికి తెచ్చరు. వెంటనే బోర్ వేయడం జరిగింది. అప్పటికప్పుడే మోటార్ బిగించి ఎర్రబోరేపల్లి గ్రామంలో నీళ్లు అందించారు. అనంతపురం పార్లమెంట్ సభ్యులు అలాగే కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యకి అభినందించారు. ఎర్రబోరేపల్లి గ్రామ ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఎర్రబోరేపల్లి గ్రామ ప్రజలు రంగయ్యకు ప్రత్యేక మైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శెట్టూరు మండలం వైస్ ఎంపీపీ ముత్యాలన్న, సర్పంచ్ వన్నూరు స్వామి , సీనియర్ నాయకులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.