మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ పూర్తి

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమ, వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్య లు ప్రమాణ స్వీకారం చేశారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీవో హనుమానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత నెల 16న బిఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ల పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంథని మున్సిపల్ లో మొత్తం 13 వార్డు కౌన్సిలర్లు ఉండగా, 9 మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండ్రు రమను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 7గురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అనంతరం వారిద్దరూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *