అమరవీరుల స్థూపానికి వినతి పత్రం
సిరా న్యూస్,ఖమ్మం;
ఆరు గ్యారింటీలలో ఐదు గ్యారింటీల మీద కాంగ్రెస్ నేతలు స్పష్టమైన ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. అమరవీరుల స్థూపానికి వినతి పత్రం ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు మరియు ఖమ్మం మంత్రులు పొంగులేటి తుమ్మల కు తెలంగాణ ఉద్యమకారులు కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పొందుపరచిన విధంగా ప్రకటించిన ఆరు గ్యారింటీలలో ఐదు గ్యారింటీల మిద స్పష్టమైన ప్రకటన చేశారు.కానీ ఉద్యమకారులకు మీరు ఇచ్చిన హామీలు ముఖ్యంగా 250 చదరపు గజాలు మరియు ఇంటి నిర్మాణం కోరకు 10,00,000/- రూపాయలు హామీలు వచ్చే డిసెంబర్ 9 సోనియా గాంధి పుట్టిన రోజు నాటికి పూర్తిస్థాయి అమలలో తెస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు.అదేవిదంగా ఉద్యమకారులకు ప్రభుత్వ నామినేటెడ్డ్ పోస్టులలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యమకారులు కోరారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల కష్ట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు.ప్రభుత్వ పెద్దలే పరోక్షంగా అనేక అవమానలకు గురిచేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికలు సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోచూసి మాకు మా జీవితాల మీద ఆశలు చిగురించాయి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అయినా ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు , ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు .