డ్రైనేజీ ని కబ్జా చేస్తున్న… పట్టించుకోని పాలకవర్గం

– పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యం
– చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి.
– వరద నీరు డ్రైనేజీలోకి పోకుండా సీజ్ చేస్తున్నటువంటి షాప్ యజమానులు
సిరా న్యూస్,జమ్మికుంట;
జమ్మికుంట మున్సిపాలిటీలో సమస్యల వలయం కొట్టుమిట్టాడుతూ ఉన్నది, చిన్నపాటి వర్షాలకి రోడ్లన్నీ జలమయం అవుతూ మోటార్ వాహనాలకు పాదాచారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. వరద నీరు డ్రైనేజీలోకి పోకుండా షాప్ యజమానులు మొత్తం సీజ్ చేస్తూ న్నప్పటికి మున్సిపల్ పాలకవర్గం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తూతూ మంత్రం చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. జమ్మికుంట మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి మురుగు కాలువ మొత్తం కబ్జాకు గురి అయ్యి రోడ్డుపై ఉన్నటువంటి వరద నీరు డ్రైనేజీ లో కి ఫోనటువంటి దుస్థితి ఏర్పడింది. చిన్న వానకే రోడ్డు మొత్తం జలమయం అవుతున్నటువంటి డ్రైనేజీ సమస్యలను ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ పై వేసినటువంటి ర్యాంపులను మెట్లను తొలగిస్తే రోడ్డుపై ఉన్నటువంటి వరద నీరు వెళ్లడానికి వీలుగా ఉంటుందని ప్రజలు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *