– కేశోరామ్ కాంట్రాక్టర్ కార్మిక సంఘం అధ్యక్షుడు సుర సమ్మయ్య..
సిరా న్యూస్,కమాన్ పూర్;
మాజీ పోలీస్ కానిస్టేబుల్ దేవి లక్ష్మీనరసయ్య త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని వదులుకున్న మహానుభావుడు అని కేశోరామ్ కర్మగారం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య అన్నారు.
హెచ్ఎస్సీ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డు తీసుకున్న దేవి లక్ష్మి నరసయ్య ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.. కన్నాల గ్రామ నివాసిగా మా అందరికీ గర్వకారణం అని పాలకుర్తి మండల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నానని తన సేవలు తనతో పాటు తన దగ్గర ఉన్నది ఇచ్చి ఇంకా కొంతమందిని జమ చేసి అందర్నీ కలుపుకొని సేవలు చేస్తాడని మరి మీ అవార్డులు తెలుసుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మాజీ సర్పంచ్ దుర్గం జగన్ స్థానికులు పాల్గొన్నారు.