సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అతి ఉత్సాహం చూపించింది. అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రేస్ ఉంటేనే స్కూల్ లోకి అనుమతి అంటూ యాజమాన్యం చిన్నారిని తోసేసింది. చిన్నారి గంట పాటు ఎండ లోనే నిలబడింది. తరువాత స్కూలు వాళ్లు చిన్నారి న తండ్రి సమాచారం ఇచ్చారు. దాంతో తండ్రి వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసాడు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే, అడ్డుకున్నారు. దాంతో అయన అందోళనకు దిగాడు.