పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు హర్షనీయం

సిరా న్యూస్,కమాన్ పూర్;
పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయమని పలువురు పద్మశాలి సంఘం నాయకులు అన్నారు.
ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశములో పలు విషయాలపై చర్చించి పలు తీర్మానాలతో పాటు 16 కార్పోరేషనులను ఏర్పాటుకు ఆమోదం తెలుపడం అందులో నేతన్నలు, పద్మశాలీల అభివృద్ధికొరకు పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం చేయడం పట్ల పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటంలో తొలి, మలి దశ పోరాట ఉద్యమంలో పద్మశాలీల పాత్ర చాలా ఉందని అటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఆదుకోవడంలో భారాస ప్రభుత్వం చిన్నచూపు చూసిందని, వారి ఉపాధి, సంక్షేమం కోసం కనీస ఏర్పాట్లకోసం ఎలాంటి కార్యక్రమం చేయలేదని, నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం పద్మశాలీల అభివృద్ధికై ఆలోచన చేయడం పట్ల హర్షం తెలియజేస్తూ, కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం చేసినందులకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మెన్ గా పద్మశాలి కులస్థుడగు మాజీ శాసనసభ్యులు ఈరపత్రి అనీల్ కుమార్ ని నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకి పద్మశాలీల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. రామగిరి మండలం నాగెపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్ ఎల్లె శశిరేఖ, మాజీ సర్పంచ్, జిల్లా పద్మశాలి నాయకులు ఎల్లె రామ్మూర్తి, పద్మశాలి నాయకులు బండారి సదానందం, కొలిపాక సారయ్య, బొద్దుల జగదీశ్వర్, వేముల వేంకటేశ్వర్లు, పెండెం వెంకటేశం, నామని కొమురయ్య, ఆడెపు వైకుంఠం, మాటేటి రవి, కొండ్ల పెద్దన్న, తదీతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *