భార్యను పంపటంలేదుని మామ పై అల్లుడు హత్యాయత్నం

సిరా న్యూస్,హైదరాబాద్;
భార్యను కాపురానికి పంపడంలేదనిఅల్లుడు మామపైహత్యాయత్నం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు ప్రాంతానికి చెందిన రామారావు (65) అనే వ్యక్తి కూతురుతో అల్లుడు సుబ్రహ్మణ్యం (30) కి వివాహం జరిగింది. వీరు ఇరువురు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని యాదగిరి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా సుబ్రహ్మణ్యం భార్య, పుట్టింటి దగ్గర నుండి తన ఇంటికి రావడంలేదని సుబ్రహ్మణ్యం కోపం పెంచుకున్నాడు. శుక్రవారం సాయంత్రం సమయంలో యాదగిరి నగర్ లోని మామ ఇంటికి వచ్చాడు మామ రామారావు (65) పై బ్లేడ్ తో మెడ కోసి, హత్యాయత్నంకి ప్రయత్నించాడు. అప్రమత్తం అయిన కుటుంబ సభ్యులు రామారావుని ఆసుపత్రికి తరలించారు. మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *