దుప్పట్లు పంపిణి చేసిన లిటిల్ స్టార్ పాఠశాల విద్యార్థులు..

సిరా న్యూస్ ,తలమడుగు:

వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణి చేసిన..

లిటిల్ స్టార్ పాఠశాల విద్యార్థులు..

వృద్ధాశ్రమంలో  వృద్దులకు దుప్పట్లు పంపిణి చేసిన లిటిల్ స్టార్ పాఠశాల విద్యార్థులు. తలమడుగు  మండలంలోని  సాయిలింగి వృద్ధాశ్రమంలో అదిలాబాద్ లిటిల్ స్టార్ హై స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని, విద్యార్థుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు , అన్నదానం, పండ్ల పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయురాలు జోష్నా మాట్లాడుతూ.. ఏడవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు నాయనమ్మ పాఠ్యాంశం పాఠాలలో పొందుపరిచి ఉండడంతో. ఈరోజు లింగీ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి, వారి బాగోగులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కమలాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ స్వరూప, సంగీతం ఉపాధ్యాయురాలు కవిత ,ప్రత్యూష తెలుగు ఉపాధ్యాయులు నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *