ట్యాంకర్ల దందాలు మొదలయ్యాయి

కేటీఆర్
సిరా న్యూస్,హైదరాబాద్;
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి పెట్టడం కాదు, వాటర్ ట్యాప్ పై దృష్టి పెట్టండి. పార్టీ గేట్లు కాదు, ప్రోజెక్ట్ గేట్లు తెరవండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2023 లో నవంబర్ లో స్పష్టం గా చెప్పాము. కేసిఆర్ అంటే నీళ్ళు, కాంగ్రెస్ అంటే కన్నీళ్ళు. పల్లెల్లో సాగు నీళ్ళు, పట్టణాల్లో తాగు నీళ్ళు లేక అలమటిస్తున్నారు. ప్రతి పట్టణం లో బిందెలతో ట్యాంకర్ ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల గొంతు ఎండుతున్నాయి. ఇదేమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడుని అన్నారు.
ధన వనరులను డిల్లీ కి తరలించడం లో ఉన్న శ్రద్ధ జలవనరులను తెలంగాణ కు తేవడం తో లేదు. ట్యాంకర్ల దందాలు హైదరాబాద్ లో మొదలయ్యాయి. ఇష్టం వచ్చినట్లు గా రేట్లు పెంచి నీళ్ల ట్యాంకర్ లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు దూప తో ఉండాల్సిన పరిస్తితి. బీ ఆర్ ఎస్ ను ఎలా ఓడగొట్టాలి. ఎలా బెదిరించాలి ,డిల్లీకి డబ్బు సూట్ కేసులు తరలించాలి అనే యావ తప్ప వేరే లేదు. కరువు వల్ల వచ్చిన కొరత కాదుజ్ కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత ఇదని అన్నారు.
కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా రేవంత్ రెడ్డి.నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్ లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీ గా నీళ్ల ట్యాంకర్ లు ఇవ్వాలని అన్నారు.
రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డి కి పంపిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తాం. నేను భయపడనని అన్నారు.
పార్టీ ఫిచాయింపులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం పై కోర్టుకు వెళ్తాం. ఘన్ పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారని అన్నారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *