రీసర్వే మూడవ విడత, ఎంఎస్ఎమ్ఈ సర్వే

తదితర అంశాలపై అధికారులు ప్రణాళికా బద్ధంగా నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి

జిల్లాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు శత శాతం పంపిణీ జరగాలి

జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

సిరా న్యూస్,తిరుపతి;
మూడవ విడత రీ సర్వే, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలు, త్రాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర సంబంధిత అంశాలపై ప్రణాళికా బద్ధంగా పని చేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, ఆరోగ్యశ్రీ కార్డులు శత శాతం పంపిణీ జరగాలని, జిల్లాలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం సిఎస్ క్యాంపు కార్యాలయం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో ఫేజ్ -3 రీ సర్వే, ఇనామ్ మరియు ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్డ్ భూములు, పేదలందరికీ ఇళ్ళు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలు, వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబం సంక్షేమo కు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష, సంతృప్త స్థాయిలో అర్హులైన అందరికీ ఆరోగ్యశ్రీ కార్డుల డిస్ట్రిబ్యూషన్, పరిశ్రమలకు భూ కేటాయింపు పెండింగ్ అంశాలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటు పురోగతి, ధాన్యం సేకరణ, పల్స్ పోలియో అంశాలపై కలెక్టర్ల స్పందన వంటి పలు అంశాలపై సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ మూడవ దశ రీ సర్వే, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ సరిపడా గుర్తించాలని, త్రాగు నీటి ఎద్దడి వచ్చే కరువు మండలాలను గుర్తించి వాటిలో నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు ప్రణాళికా బద్ధంగా పని చేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, ఎలాంటి అలసత్వం ఉండరాదని అన్నారు. ఎంఎస్ఎమ్ఈ సర్వే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సూచించారు. రోజువారీ ధాన్యం ధరలు సిఎం యాప్ లో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాన్సర్ సర్వే ఎంపిడిఓ యంత్రాంగం వాలంటీర్లు రెండు గృహ సందర్శనలు చేసేలా వేగవంతం చేయాలనీ, ఎఎన్ఎం గృహ సందర్శన చేసి టెస్టింగ్ లు షెడ్యుల్ మేరకు జరిపేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డులు శతశాతం పంపిణీ చేసి ఈ కెవైసి అప్డేట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి కుటుంబం డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. రేపు నేషనల్ ఇమ్యునైజేషన్ డే జిల్లాలో పల్స్ పోలియో విజయవంతానికి కృషి చేయాలని, అన్ని వర్గాల వారు ఇందుకు సహకరించాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర నారాయణ, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త రాజశేఖర్ రెడ్డ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *