సిరా న్యూస్,మేడ్చల్;
ఉప్పల్ చిలుకానగర్ బస్టాప్ దగ్గర ఒక ప్రయాణికునికి సడన్ గా శ్వాస సమస్య రావడంతో అక్కడినే ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ లక్ష్మిమాధవి, ఇన్స్పెక్టర్ సూర్య నాయక్ స్పందించి, సిబ్బందితో అట్టి వ్యక్తిని పోలీస్ వెహికిల్ లో హాస్పిటల్ కు తరలించారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు అధికారులు సీఆర్ఎంపి సహాయంతో చిలకానగర్ లో గుంతలను పూడ్చే సమయంలో ఐటీసీ లిమిటెడ్ ఉద్యోగి బీపేష్ గజ్లే అనే వ్యక్తి తన భార్య ఆర్తితో కలిసి మేడిపల్లి నివాసానికి వెళ్తున్నాడు. చిల్కానగర్ బస్ స్టాప్ వద్ద, ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఇన్స్పెక్టర్స్ లక్ష్మీ మాధవి, సూర్య నాయక్ లు వెంటనే స్పందించి అట్టి వ్యక్తిని పోలీస్ వెహికిల్ లో హాస్పిటల్ కు చికిత్స కోసము పంపించారు. వైద్యులు పరీక్షించి ప్రాణాపాయం లేదని చెప్పారు.అత్యవసర పరిస్థితిలో మానవత్వం చాటి స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ లక్ష్మి మాధవి, సూర్య నాయక్ లను స్థానికులు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు…