ప్లాట్లను చేరువే కబ్జా చేసిందంటూ బాధితులు ధర్నా

సిరా న్యూస్,అమీన్ పూర్;
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు ప్లాట్లను ముంగేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సర్వే నంబర్లలో 5000 మంది బాధితులు ప్లాట్లను కొనుగోలు చేశామని నేడు నీటితో నిండి తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1985 సంవత్సరంలో ప్లాట్లను కొనుగోలు చేశామని అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని నేడు 460 ఎకరాలుగా ఎలా అయ్యిందంటూ ప్రశ్నించారు. ఎంతోమంది చెరువులను కబ్జా చేస్తుంటే మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందని తమకు న్యాయం ఎవరు చేస్తారని అన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పడింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యంగా చెరువుకు ఉన్న తూములను ప్రారంభించి మా ఫ్లాట్లను మాకు ఇప్పించాలని కోరుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు తమ సమస్యను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం అయినా తమ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *