సిరా న్యూస్,విజయనగరం;
దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీలోని భోజరాజుపురం చెందిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారుర. గడిచిన ఐదేళ్లుగా తమ గ్రామానికి ఎలాంటి అభివృద్ది జరగలేదని అందుకే ఎన్నికలను బహిస్కరిస్తున్నామని అన్నారు. ఇది వరకే కలెక్టర్ కి, స్థానిక వైసిపి ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యకు పలుమార్లు వినతిపత్రాలు గ్రామస్థులు ఇచ్చారు. ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించలేదని అన్నారు. తమ విన్నపాలకు న్యాయం జరగలేనప్పుడు, ఎన్నికల్లో పాల్గొని ఉపయోగం ఏమి ఉందంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. ఎన్నికలను బహిష్కరించిన గ్రామంలో 205 మంది ఓటర్లు వున్నారు. 2.5 కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేయలేని పాలకలకు ఉంటే ఎంత…..లేకపోతే ఎంత అంటూ ఆగ్రహంవ్యక్తం చేసారు.
========================