స్వామి స్వరూపానంద
సిరా న్యూస్,విశాఖపట్నం;
దేశం మొత్తం శివనామ స్మరణ చేస్తోందని శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద అన్నారు. అన్ని కుటుంబాలు కూడా శివ అభిషేకం చేయడం ఆనవాయితీ. విశాఖ చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. శివుడికి అభిషేకం చేసుకోలేని వారి కోసం విశాఖలో సుబ్బిరామి రెడ్డి కుంబాభిశేకం ఏర్పాటు చేశారు. 39 ఏళ్లుగా విశాఖలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా విశాఖలో ఈ కుంబాభిషేకం నిర్వహిస్తున్నాము. ఐదు సంవత్సరాలు నుండి కోటి లింగాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కూంబాభిషేకం వలన ప్రజలకు మంచి జరుగుతుంది. కుంబాభిషేకం వలన తుఫానుల లాంటి విపత్తుల నుండి ప్రజల రక్షించబడుతున్నారు. ఈ ప్రాంత అంతా సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేకపూజులు చేస్తున్నామని అన్నారు.