సిరా న్యూస్,సూర్యాపేట;
మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామం లో ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగదు, బంగారం చోరీ చేశారు. మోదుగు జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉదయాన్నే పొలం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తాళం పగల కొట్టి ఉంది. బీరువాలో ఉన్న 10వేల నగదు, రెండు ఉంగరాలు, రెండు జతల దిద్దులు చోరీ కి గురై అయినట్టు గుర్తించారు. పోలీసులు పిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు వెల్లడించారు.