సిరా న్యూస్,మేడ్చల్
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి కొర్రెముల గ్రామం లక్ష్మి నగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొత్తకోట ఉదయకాంత్ రెడ్డి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు తాళం పగలకొట్టి చొరపడ్డారు. రెండు తులాల బంగారం, యాబై వేల రూపాయల నగతు, ఒక మొబైల్ ఫోన్ ను దొంగలు ఎత్తుకెల్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోచారం పోలీసులు, క్లూస్ టీమ్ తో వేలిముద్రలు సేకరించారు.