సిరా న్యూస్,గుంతకల్లు;
కూరగాయల మార్కెట్ లో ఉన్న ఓ హోటల్ లో చోరీ జరిగింది. 80 వేల రూపాయల నగదు, 20 వేల రూపాయల విలువ చేసే సిగరెట్ ప్యాకెట్ లను దుండగులు ఎత్తుకెళ్లారు. గోవిందు హోటల్ లో ఘటన జరిగింది. రాత్రి వేళలో హోటల్లో ఎవరూ లేని సమయంలో ద్వారం గుండా ప్రవేశించి, కౌంటర్ లో ఉన్న 80 వేల రూపాయలు డబ్బును, 20వేల రూపాయలు విలువజేసే సిగరెట్ ప్యాకెట్ లను చోరీ చేశాడు. ఉదయాన్నే హోటల్ యజమాని హోటల్ తలుపు తెరిచి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. – ఈ ఘటనపై పోలీసులకు హోటల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…