సిరాన్యూస్, తలమడుగు
తెల్లకల్లు స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
అనుమతి లేని తెల్లకల్లు స్థావరాలపై ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ సీఐ ఆర్ విజేందర్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి, తలమడుగు, కుచులాపూర్, ఉమ్రి, ఆదిలాబాద్ మండలంలోని తంతొలి, అంకోలి, లోకారి గ్రామాల్లోదాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 143 లీటర్ల తెల్లకల్లును ధ్వంసం చేశారు. అనుమతి లేకుండా తెల్లకల్లు విక్రయాలు చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.