సిరా న్యూస్,కోనసీమ;
ద్రాక్షారామo శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజాద ర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు దేవస్థానం ఆలయ ఈవో తారకేశ్వరరా వు,ఇద్దరు సిబ్బందిపై పలు అవినీతి ఆరోపణలు చేసారు. ఆలయానికి పిలిచే టెండర్లు, ఆలయ ప్రాంగణం లో దుకాణాలు యాజమా నుల నుంచి భారీ మొత్తం సొమ్ములు వసూలు చేసి స్వాహా చేశారని పలు వురు పిర్యాదుచేసారు.
దాతలు ఇచ్చిన సొమ్ముతో రథాన్ని తయారు చేసి మాజీ మంత్రి వేణు పేరు శిలాఫల కం పై ఎలా వేశారు అంటూ ఇవో ను మంత్రి నిలదీసారు. రథం నేనే నిర్మిస్తానని చెప్పి వేలకోట్లు మాజీ మంత్రి వేణు దండుకున్నారని అయన ఆరోపించారు. మాజీ మంత్రి వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం వంటశాల నుంచే ఆహారపదార్థాలు సరఫరా చేసారని ఇవో ను మంత్రి నిలదీసారు.
మంత్రి మాట్లాడుతూ భీమేశ్వరస్వామి ఆలయాన్ని అధికారులు అవినీతి మయం గా మార్చేసారు. ఆలయ అవినీతి పై విజిలెన్స్ కు పిర్యాదు చేశా. విచారణ జరుగు తుంది. అవినీతి నిర్మూలన ద్రాక్షారామ నుంచే శ్రీకారం చుట్టా. రామచంద్రపురం నియోజవర్గం లో అవినీతి జరిగితే ఉపేక్షించేదిలేదని అన్నారు.
===========