సిరా న్యూస్,తిరుపతి;
టీటీడీ పాలకమండలి నిర్ణాయాలపైసమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను విచారించాలి. కమిషన్ల కోసం కొన్ని అంశాలను టేబుల్ ఎజెండా క్రింద తీసుకొచ్చి ఆమోదించారు. కొన్ని నిర్ణయాలు పాలకమండలి సభ్యులకే తెలియదు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను స్టేట్ విజిలెన్స్ విచారణ చేయాలి. న్యాయ నిపుణులతో మాట్లాడి గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకొనేలా చేస్తాం. గత పాలకమండలి సభ్యులు వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని అయన అన్నారు.