సిరా న్యూస్,జగ్గంపేట;
జగనన్న కాలనికి మంజూరైన రూ.2.58 కోట్ల నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జగ్గంపేట దివాణం తోటలో సుమారు 3 వేల మందికి ఇళ్ల స్థలాలు వద్ద ఆయన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా కర్నాకుల మాట్లాడుతూ ఆ కాలనీలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. జగనన్న కాలనీ డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వంలో మంజూరైన 2 కోట్ల 58 లక్షల 65 వేల రూపాయలను ఈ స్థలం మట్టితో అక్కడక్కడ తూతూ మంత్రంగా రోడ్లు వేసి బిల్లులు చేసుకున్నారన్నారు. గుర్రపాలెం, గొల్లలగుంట, మర్రిపాక, రాజపూడి, మొదలగు గ్రామాలనుంచి గ్రావెల్ మట్టి తరలించి జగనన్న కాలనీ డెవలప్మెంట్ చేశారని రికార్డుల్లో నమోదై ఉందన్నారు. కానీ ఇక్కడ మట్టిని తూతూ మంత్రంగా రోడ్లు వేసుకుని ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని ఆయన విమర్శించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించి జగనన్న కాలనీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల పై సమగ్ర విచారణ చేపట్టి,అభివృద్ధి పేరుతో నిధులను పక్కదారి పట్టించిన ప్రభుత్వ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల తాసిల్దార్ కార్యాలయాన్ని,జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.