మంత్రి సీతక్క
సిరా న్యూస్,హైదరాబాద్;
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా తాగు నీటి సరఫరాలో సమస్య రానీయ కూడదు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలి. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లోకల్ సోర్సు ల మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఐదు, ఆరు నియోజకవర్గాలను ఒక యూనిట్ గా ప్రణాళికలు రూపొందించాలి. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీల్లు వస్తున్నా ప్రజలు బోర్లు వేయించాలని, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని అన్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత బోర్ల మీద, ఆర్వో ప్లాంట్ల మీద ప్రజలు డిపెండ్ అవుతున్నారు. ఆ విధానం పోయేలా మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలి. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ ట్యాంకులను తరచు శుభ్ర పరచాలి. మిషన్ భాగీరథ పైప్ లైన్ల లీకేజీ ని అరికట్టాలి. తాగు నీటి సరఫరా పై అన్ని గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించండి. నేటి సరఫరా లో సమస్య తలెత్తుతున్న ఉట్నూర్ వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయండని అన్నారు.
క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఏ నెలలో ఏ పని చేయాలో క్యాలెండర్ ను రూపొందించుకోవాలి. ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్ వుండాలి. ఆయా గ్రామాల్లో ఏదన్నా సమస్యతో మిషన్ భగీరథ నీళ్లు రాక పోతే ఆల్టర్నేట్ సోర్సు సిద్ధం చేసుకోవాలి. మోటు పట్లు సవరించుకొని పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి. గాలి తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది మంచినీరే. కోట్ల మంది ప్రాణాలు మిషన్ భగీరథ సిబ్బంది చేతిలో ఉన్నాయి. అందుకే అంతా బాధ్యతతో పనిచేయాలి . విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. గత సమ్మర్ లో నీటి ఎద్దడి వున్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని అందించాం. 13456 మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చాము. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను త్వరలో అందుబాటులోకి తెస్తామని అన్నారు.
=======================