సిరా న్యూస్,భువనగిరి;
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం సృష్టించింది. జైకేసారంలో బాలికను అపహరించేందుకు విశ్వప్రయత్నం చేసింది. బాలిక అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు, కిడ్నాప్ చేసి పరారవుతుండగా కారును చేజ్ చేసి పట్టుకున్నారు. కిడ్నాపర్ను పట్టుకుని దేహశుద్ధి చేసారు. తరువాత పోలీసులకు అప్పగించారు.