సిరా న్యూస్,హైదరాబాద్;
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో టాప్ టెన్‌లో ముగ్గురు అమ్మాయిలు నిలిచారు. తొలి ర్యాంకర్ ఆలూరు ప్రణీత. ఆమె ఏపీకి చెందిన విద్యార్థిని.
అగ్రికల్చర్, ఫార్మసీలో టాపర్స్..
1. ఆలూరు ప్రణీత – అన్నమయ్య జిల్లా, ఏపీ
2. నగుదశారి రాధాకృష్ణ – విజయనగరం
3. గడ్డం శ్రీ వర్షణి – వరంగల్
4. సోమ్‌పల్లి సాకేత్ రాఘవ్ – చిత్తూరు
5. రేపాల సాయి వివేక్ – గోల్కొండ, హైదరాబాద్
6. మహ్మద్ అజాన్ సాద్ – మేడ్చల్ మల్కాజ్గిరి
7. వడ్లపూడి ముఖేశ్ చౌదరి – తిరుపతి
8. జెన్ని భార్గవ్ సుమంత్ – కుత్బుల్లాపూర్
9. జయశెట్టి ఆదిత్య – కూకట్పల్లి, హైదరాబాద్
10. పూల దివ్య తేజ – శ్రీ సత్యసాయి జిల్లా, హైదరాబాద్
================