ముగ్గురు మృతి
సిరా న్యూస్,నెల్లూరు;
కావలి గౌరవరం టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని కారువెనకనుంచి ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెదారు. మరొకరి ఒకరి పరిస్థితి విషమంగా వుంది. ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలుఅయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
చెన్నై నుండి లక్నో కి ఏసీ లతో వెళ్తున్న కంటైనర్ లారీ.. చెన్నై నుండి ఏలూరుకు వెళుతున్న స్విఫ్ట్ కారు అతివేగంగా ఢీకొట్టడంతో ఘటన జరిగింది. లారీ కింద ఇరుక్కున్న కారు ను క్రేన్ సహాయంతో బయటకు లాగానే డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
===============================