ముగ్గురు మృతి
సిరా న్యూస్,మహబూబ్ నగర్;
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ స్టేజ్ సమీపంలో 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. కారు కర్నూల్ వైపు నుండి హైదరాబాద్ కు వెళుతుంది.
బైకును తప్పించబోయి ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కున్న వారిని క్రేన్ సహాయంతో బయటకు తీసారు. అతువేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.