యాభై కేసులున్న దొంగ అరెస్టు

 సిరా న్యూస్,హైదరాబాద్;
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియదర్శిని కాలనీ లో స్వాతి అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ మరియు మునగానూర్ లో జరిగిన 2 కేస్ లను హయత్ నగర్ పోలీస్ లు చేధించారు. ఆంద్రప్రదేశ్ కాకినాడ కి చెందిన షేక్ అజీజ్ అనే అంతర్ రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడు పతివాడ లోవరాజు పరారీలో వున్నాడు. నిందితుని నుండి 23 తులాల బంగారు ఆభరణాలు,2లక్షల నగదు,ఒక కెమరా,ఒక మొబైల్ ఫోన్ మరియు టయోటా గ్లాంజా కార్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని పై 2024 లో ఇప్పటివరకు 12 కేస్ లు నమోదు అయ్యాయి. రాచకొండ కమీషనరేట్ హయత్ నగర్ లో 3, కొయ్యల గూడెం లో 1,నిజామా బాద్ 1 మరియు ఆంధ్రప్రదేశ్ పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేస్ లు నమోదుఅయ్యాయి. నిందితుని పై 2008 నుండి 2013 వరకు 50 కేస్ లు నమోదుఅయినట్లు పోలీసులు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *