సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణారావుపేట శివాలయం లో అర్ధరాత్రి దొంగలు చోరీకి తెగబడ్డారు గుడి తాళాలను పగలగొట్టి ఏకంగా శివ, పార్వతుల పంచంలోహల విగ్రహాలను అపహరించుకొని వెళ్లారు.అనంతరం పక్క గ్రామంలోని జూటూరులో జమ్ములమ్మ ఆలయ తాళాలు పగలగొట్టి హుండీ దొంగలించేందుకు ప్రయత్నించి వీలు కాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు.గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిసికెమెరాల్లో నమోదైన దృశ్యలను,ఇతర క్లూ స్ ను సేకరించి విచారణ చేపట్టారు. ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడినట్లు సిసి కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి.సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.