సిరా న్యూస్,తాడిపత్రి;
అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఉన్న కె.వి.రెడ్డి నగర్ లో మొదటి అంతస్తులో ఉన్న సరోజమ్మ దగ్గరకు బుర్ఖా వేసుకుని కత్తులు తీసి గాయ పరిచి మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు సైతం దోచుకెళ్ళారు. – దాదాపు 12 తులాలు బంగారం దోచుకున్నట్లు బాధితురాలు సరోజమ్మ తెలిపారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డిఎస్పి జనార్దన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే గత వారం రోజులుగా వరుసగా చోరీలు జరుగుతుండడంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
=====