సిరా న్యూస్,కామారెడ్డి ;
విధులకు డుమ్మా కొడుతూ జీతం మెక్కుతున్న డాక్టరమ్మ భాగొతం బయటపడింది. ఓ బీఆర్ఎస్ నేత కూతురు జోహా ముజీబ్ దేవునిపల్లి పీ.హెచ్.సిలో మెడికల్ ఆఫీసర్ గా నియామకం జరిగింది. ఇక్కడ విధులకు హజరుకాకుండానే హైద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.అయినా, నెలల తరబడి విధులకు హాజరుకాకున్న వచ్చినట్టుగా రిజిష్టర్ లో సంతకాలు వున్నాయి. గమనించిన స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. దాంతో కలెక్టర్ విచారణ కు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలో మెడికల్ ఆఫీసర్ భాగోతం బయటపడింది. విచారణ అధికారి వచ్చేసరికి రిజిష్టర్ లో సీఎల్ గా సంతకం మారింది. విచారణ అధికారి వచ్చేలోపు సిబ్బంది సంతకాలను తారుమారు చేసారు.