కేశినేని చిన్నీ
సిరా న్యూస్,అమరావతి;
ఎంపి కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) మండిపడ్డారు. మా కుటుంబ కలహాలు 1999నుంచీ ఉంటే, చంద్రబాబు కేం సంబంధమని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని అన్నా 99నుంచీ నేనే సద్దుకుంటు పోతున్నా. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నాని కి లేదు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం ని వీడిన పార్టీకేం కాలేదు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం ని ఏం చేయలేకపోయారని అన్నారు.