సిరా న్యూస్,ముంబాయి;
దేశ ఆర్ధిక రాజధాని ముంబాయి లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం ఉదయం పోలీసులకు సందేశాలు వచ్చాయి. దాంతో పోలీసులు అప్రమత్తమైయారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బెదిరింపుల వెనక ఎవరున్నారో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫోను కాలు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు నిర్దారించారు.
గురువారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ లో ముంబాయి లోని ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆ వ్యక్తి పేర్కోన్నాడు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్ను వేసారు. అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక విభాగం దర్యాప్తు ప్రారంభించారు.