సిరా న్యూస్,కడప;
పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామ పొలాలలో ఘటన జరిగింది. పిడుగుపాటుకు మహిళతో పాటు అబ్బాయి ఒక యువకుడు మృతి చెందారు. మృతులు శివపార్వతి (30) తేజేశ్వర్ రెడ్డి (10) మారుతి ప్రసాద్ రెడ్డి (30) గా గుర్తించారు. మృతులు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా వర్షం పడుతుంటే చెట్టు కిందకు వెళ్లడంతో పిడుగుపాటుకు గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.