సిరా న్యూస్,అదిలాబాద్;
గుడిహత్నూర్ మండలం సీతగోంది గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అతివేగంగా వచ్చిన మూడు లారీలో పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జైన రెండు లారీల క్యాబీన్ లలో ఇద్దరు డ్రైవర్ లు చిక్కుకున్నారు. క్యాబీన్ లలో ఇరుక్కుని తీవ్ర గాయాలతో డ్రైవర్ ల అర్తనాదాలు చేసారు.ఇరుక్కున్న డ్రైవర్ లను కాపాడేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఘాట్ డౌన్ లో ఐచర్ వాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీకొని, మరో లారీని ఢీకోట్టడంతో ప్రమాదం జరిగింది.