బేల, సిరా న్యూస్ :
పంటల సాగు కోసం త్రీఫేస్ విద్యుత్ ఇవ్వాలని వినతి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు గ్రామాల రైతులకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని యువజన కాంగ్రెస్ నాయకులు కోరారు. మంగళవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయంలో పీవో చాహత్ బాజ్ పాయ్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని దేవుజీ గూడ, కడ్కి, సదల్ పూర్, వరుర్ గ్రామాల్లోని నీటి బావుల్లో నీరున్నా విద్యుత్ సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రైతుల ప్రయోజనాల కోసం నిరంతర కరెంట్ ఇవ్వాలని కోరారు. వ్యవసాయం సాఫీగా సాగాలంటే విద్యుత్ సౌకర్యం తప్పనిసరన్నారు. ఈనేపథ్యంలో విద్యుత్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. పంటల కోసం కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.వినతి పత్రం అందించిన వారిలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కోడప బిం రావు, ఆనంద్ రావు, వాసుదేవ్, నాందేవ్, అంబదాస్, తులసిరామ్, జైతూ, మారుతి తదితరులు ఉన్నారు.