Thula Arun Kumar: ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా హస్తం పార్టీ ప్రచారం

సిరా న్యూస్, బోథ్‌
ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా హస్తం పార్టీ ప్రచారం
* తుల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జోరందుకున్న ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో లోక్ స‌భ‌  ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. లోకసభ ఎన్నికల్లో మెజారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అడవుల జిల్లాగా పేరుగాంచిన అదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీ తరుపున లోక్ సభ బరిలో ఆదివాసీ మహిళ ఆత్రం సుగుణను బరిలో నిలిపి ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్ విసిరింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా జనాకర్షక నేతలను, చరిష్మా గల యువ నాయకులను రంగంలోకి దింపి ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థి గెలుపుకై ప్రచారం చేయిస్తోంది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో భోథ్ నియోజకవర్గంలో ఈసారి జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. భోథ్ నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని నేతగా వెలుగొందిన ప్రముఖ రాజకీయ నేత, దివంగత తుల సుభాష్ ( ఏ పీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ) వారసుడు తుల అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా భోథ్ మండలంలోని పలు ఆదివాసీ పల్లెల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసమై ప్రత్యేకంగా ప్రణాళిక రచిస్తూ తన అనుచరులతో కలిసి ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో అమలవుతున్న ఐదు గ్యారెంటీ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ మున్ముందు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరే మరిన్ని పథకాలను తీసుకువచ్చి ఎల్లప్పుడు మీ శ్రేయస్సు కొరకై పని చేస్తామని తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణంపై ,500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాల గురించి ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో మహిళలకు అడిగి తెలుసుకుంటున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలను అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టామని ,కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినవన్నీ రాబోయే మున్ముందు రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రచారంలో భాగంగా ప్రజలకు అందిస్తామని భరోసా కల్పించారు. భోథ్ మండలంలోని పలు గ్రామాల్లో తుల అరుణ్ కుమార్ ప్రచారం చెయ్యడంతో ఆయా గ్రామల ప్రజలు మద్దత్తుగా నిలుస్తూ లోక్ సభ ఎంపీ అభ్యర్థి గెలుపుకై మా వంతు సహాయసహకారాలు అందిస్తామని తెలియజేశారు.నాలుగైదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ సంక్షేమాన్ని కూడా ప్రజలకు అర్థం చేయించేలా తుల అరుణ్ కుమార్ ప్రత్యేకంగా ఒక్కో పథకంపై వివరణ అందిస్తూ వారి సలహాలను తీసుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో భాగంగా తుల అరుణ్ కుమార్ కు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది.ఆదివాసీ గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి మీ శ్రేయస్సుకై ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ ప్రచార పర్వంలో భాగంగా డివిడి పల్లె, కోట (కే ) గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారములో ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ,అనుచరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *