Thunderbolt: గిమ్మలో పిడుగుపాటు: ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

సిరా న్యూస్, అదిలాబాద్:

గిమ్మలో పిడుగుపాటు: ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు…

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన మామిడిపెళ్లి కిరణ్ (45) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన మామిడిపెళ్లి కిరణ్, మంద సంటెన్న, కోల భోజన్న, కూరెల్లి టిల్లు, కుండ రమేష్ లు మామిడిపెళ్లి కిరణ్ చేన్లో ఉండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో వీరంతా చేన్లో ఉన్న మోదుగు చెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటు శబ్దం వినిపించడంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆటోలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ కి తరలించారు. అయితే రిమ్స్ తరలించే క్రమంలోనే మామిడిపెళ్లి కిరణ్ మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో క్షతగాత్రుడు మంద సంటెన్న ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషయంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న లు వేరువేరుగా రిమ్స్ కు చేరుకొని బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *