కొమురంభీం ఆసిఫాబాద్;
రెండు పులుల మృతితో కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ లో హై అలర్ట్ నెలకొంది. దరిగాం అటవి ప్రాంతంలో టైగర్స్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దరిగాం ఫారెస్ట్ లో 22 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసారు. రెండు పులుల ఆచూకీ కోసం 14 బృందాలతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. 73 వ క్యాంపు బృందానికి పులుల పాదముద్రలు కనిపించినట్లు సమాచారం.