సిరా న్యూస్, హైదరబాద్:
తెలంగాణలో డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబందించిన టైమింగ్‌ను ఈసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సమయానుసారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈసీ కసరత్తూ చేస్తోంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ల జారీ వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేసింది.
టైమింగ్ ఇలా..
+ ఓట్ల లెక్కింపు అధికారులు, ఇతర సిబ్బంది ఉదయం 5 గంటలకే బ్యాలెట్ బాక్స్‌లు, ఈవీఎంలను తీసుకొని కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి.
+ ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
+ ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
+ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు పూర్తి కాకపోతే, ఈవీఎం ఓట్ల లెక్కింపుతో పాటు కొనసాగించడం జరుగుతుంది..
+ గెలిచిన అభ్యర్థికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, సంబంధిత రిటర్నింగ్ అధికారి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటించడంతో పాటు సర్టిఫికెట్ అందించడం జరుగుతుంది.
+ సాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ఈసీ సర్వం సిద్దం చేసింది.
+ ఎక్కడైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అయితే, ప్రక్రియ పూర్తి అయ్యే వరకు రాత్రి వరకు కూడ కొనసాగించడం జరుగుతుంది.