సిరాన్యూస్, ఆదిలాబాద్
వృద్ధాశ్రమంలో వివాహ మహోత్సవ వేడుకలు
* ఆదర్శంగా నిలుస్తున్న తిరుమని స్వప్న- వెంకట్ దంపతులు
నేటి సమాజంలో పుట్టినరోజు వేడుకలు, వివాహ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని గూడ గ్రామానికి చెందిన తిరుమని స్వప్న- వెంకట్ దంపతులు బుధవారం తమ వివాహ మహోత్సవన్ని అదిలాబాద్ కేంద్రంలోని కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో వారి మధ్య వివాహ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వారికి భోజనాన్ని ఏర్పాటు చేసి వారి ఆశీర్వాదం పొందారు. అనంతరం వారిని పలువురు అభినందించారు.